అటవి ప్రాంతంలో రోడ్డు మార్గాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి..

by Disha Web Desk 20 |
అటవి ప్రాంతంలో రోడ్డు మార్గాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సిరికొండ మండలం రంమచంద్రపల్లి (జంగిలోడి తండా) నుండి చింతల్ తాండా వరకు దట్టమైన అటవీ ప్రాతం రోడ్డు మార్గాన్ని దాదాపు 5 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ , జిల్లా డీఎఫ్ఓ ఆఫీసర్ వికాస్ మీనన్ తో కలిసి పరిశీలించారు. తాండ ప్రజలు ఏళ్ల తరబడి నుండి రోడ్డు మార్గానికి వేచి చూస్తున్న వారి కలనెరవేర్చేందుకు డీఎఫ్వో అధికారి తీసుకొని దట్టమైన అడవిలో రోడ్డు మార్గాన్ని రోడ్డు వేయడానికి సంబంధించిన క్లియరెన్స్ కొరకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ కొన్నేళ్ల నుండి రంమచంద్రపల్లి, చింతల్ తాండా గ్రామాల ప్రజలు, రోడ్డు మార్గాన్ని మంజూరు చేయాలని పట్టుపట్టగా, ప్రజల కోరిక మేరకు శనివారం డీఎఫ్వోను తీసుకొని వచ్చారన్నారు.

డీఎఫ్వో స్వయంగా వారి కళ్ళతో చూస్తే, తొందరగా పని అయితుందని ఉద్దేశంతో వారిని వెంటబెట్టుకుని తీసుకువచ్చారని, ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా పూర్తిచేయాలని వారిని ఎమ్మెల్యే కోరారు. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నిధులు సమకూర్చుకొని అతితొందర్లోనే రోడ్డు పనుల ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. తాండా ప్రజలు, ఫారెస్ట్ అధికారులకు అన్ని విధాలుగా సహకరించాలని, ఎవరు చెట్లు నరకవద్దని ఆయన తాండ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, వైఎస్ ఎంపీపీ తోట రాజన్న, సర్పంచులు రాజారెడ్డి , భూక్య లతా గంగాధర్, రాజు నాయక్, కృష్ణానాయక్, ఉపసర్పంచ్ రఘువరు, రెడ్యనాయక్, బుమేష్, రాజు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed