బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు : గాలి అనిల్ కుమార్

by Disha Web Desk 11 |
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు : గాలి అనిల్ కుమార్
X

దిశ, జుక్కల్ ‌: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంన్ సిందే మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు కావడం లేదని అన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపిపి సుర్నర్ యశోద నీళ్లు పటేల్, వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, వాసురే రమేష్, గుండు సర్పంచ్ బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed