బీజేపీలో అభ్యర్థుల కొరత

by Disha Web Desk 12 |
బీజేపీలో అభ్యర్థుల కొరత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల ఖరారు పై సందిగ్ధత కొనసాగుతోంది. రేపోమాపో అంటూ అభ్యర్థుల ఖరారును ఆలస్యం చేస్తుండడంతో లీడర్లతో పాటు క్యాడర్‌లోనూ అయోమయం నెలకొంది. ఈ నెల 3నుంచి నామినేషన్ల స్వీకరణ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఆలస్యం చేస్తుండడంతో నియోజకవర్గాల్లో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొదటి విడత లో మూడు నియోజకవర్గాలు, రెండవ విడతలో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటికి నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం, ఎల్లారెడ్డి నియోజకవర్గం టికెట్ల వేటలో అభ్యర్థులు బిజీగా ఉండడంతో పరిస్థితి ఓట్లను సాధించేందుకు లీడర్లకు స్థానికంగా ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల మినహా బాన్సువాడ నియోజకవర్గంలో ప్రచారం మొత్తం బంద్ అయింది. ఎల్లారెడ్డిలో మొత్తం అదే పరిస్థితి నెలకొంది. దానితో నియోజకవర్గాల్లో టికెట్లు ఎప్పుడు ఖరారు అవుతాయో తెలియక ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌లో టికె ట్లు రాని అసంతృప్తులు ఉంటే వారికి టికెట్లు ఇచ్చే విధంగా ప్రణాళిక చేశారన్న ప్రచారంలో జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి కనిపించని పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో రెండు, కామా రెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో కార్యవర్గం గాని, రాష్ట్ర కార్యవర్గం గానీ నజర్ వేయలేని పరిస్థితి ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది ఇప్పటికి సందిగ్ధం నెలకొంది.

అక్కడ కులాచారి దినేష్ ప్రచారం చేసుకుంటున్న అతడికి టికెట్ ఇస్తారో లేదోనన్న సందిగ్ధం నెలకొంది. అదే మాదిరిగా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న యెండల లక్ష్మీనారాయణకు అక్కడ టికెట్ ఇస్తారా, బాన్సువాడ కు బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మల్యాద్రి రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపడంతో అక్కడ ప్రత్యామ్నాయం చూసుకునే పనిలో పడినట్లు తెలిసింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఇటీవల బీజేపీలో చేరిన మరో నేత కోసం చర్చలు జరుగుతున్నాయి. బోధన్ నియోజకవర్గంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. అక్కడ బీసీ నేత కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సంఘ్ పరివారక్ చెందిన నేతను టికెట్ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed