ధరణి టౌన్షిప్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : కలెక్టర్

by Kalyani |
ధరణి టౌన్షిప్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, రెవెన్యూ పర్యవేక్షకులు జ్యోతి, ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, మున్సిపల్ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.Next Story

Most Viewed