పెరికిట్లో ఈనెల 5న ఉచిత మెగా ఆరోగ్య శిబిరం

by Dishanational1 |
పెరికిట్లో ఈనెల 5న ఉచిత మెగా ఆరోగ్య శిబిరం
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ లోని పెరికిట్లోని ఎంజీ ఆసుపత్రి వైద్యుడు డా. మధు శేఖర్ చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 5న ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు బుధవారం పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజా వైద్యులు డాక్టర్ మధుశేఖర్ సారధ్యంలో రెండున్నర దశాబ్దాలుగా చేయూత పేరుతో అందిస్తున్న సేవలను 42వ మెగా హెల్త్ క్యాంపుతో మరోసారి పునరుద్ధరిస్తూ నిరుపేదల కోసం తలపెట్టిన ఆరోగ్య శిబిరంలో ఆర్మూర్ ప్రాంతంలోని నిరుపేద ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని సంస్థ ప్రతినిధులు కోరారు. మెగా ఆరోగ్య శిబిరంలో భాగస్వాములవుతున్న 40 మందికి పైగా వైద్య బృందానికి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ శిబిరంలో సర్జరీలు, ఇతర సేవలు కూడా ఉచితంగా లభిస్తాయని, ఈ విషయాన్ని నిరుపేదలందరికీ తెలియజేయాలని చేయూత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ పాఠశాలను చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మధు శేఖర్ పెర్కిట్, కోటార్ మూర్ గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులతో కలిసి మెగా ఆరోగ్య ఉచిత శిబిరానికి స్థల పరిశీలన చేశారు.


Next Story

Most Viewed