ఫిబ్రవరి 15ని సేవాలాల్ జీ మహారాజ్ బంజారా దినోత్సవంగా ప్రకటించాలి

by Disha Web Desk 15 |
ఫిబ్రవరి 15ని  సేవాలాల్ జీ మహారాజ్ బంజారా దినోత్సవంగా ప్రకటించాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు , సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. బుధవారం పార్లమెంట్ సెషన్ లో భాగంగా జరుగుతున్న సమావేశంలో జిరో అవర్ లో ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం గిరిజనుల సం క్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిందన్నారు. గిరిజన మహిళా రాష్ర్టపతిగా ఎంపికైనప్పటి నుంచి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు, జన్‌జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకల వరకు గిరిజన సమాజంలో గర్వాన్ని నింపాయి అన్నారు. దేశ చరిత్రకు బంజారా కమ్యూనిటీ చేసిన కృషి , సహకారాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సంత్ సేవాలాల్ జీ మహారాజ్ బంజారా సమాజంలో గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా గౌరవించబడ్డారని తెలిపారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతైన ఫిబ్రవరి 15ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు.

Next Story

Most Viewed