ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..

by Disha Web Desk 20 |
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..
X

దిశ, గాంధారి : చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అనే నానుడి ఈ శాఖ అధికారులకు అచ్చుగుద్దినట్టు వర్తిస్తుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఇంటి పై నుండి 11 కి వైర్లు డాబాపైకి వెళ్ళితే చూసుకోకపోతే పెను ప్రమాదం తప్పేదేలే. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దగుజులు గ్రామానికి చెందిన ఓ ఇంటి యజమాని దాబా పై నుండి 11 కేవీ వైర్లు వెళ్తుండడంతో ఇంటి యజమాని కరెంట్ అధికారులకు, లైన్మెన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు.

అకస్మాత్తుగా తెలియకుండా డాబా ఎక్కితే పెను ప్రమాదం సంభవిస్తుందని, ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అని ఇంటి యజమాని సంబంధిత అధికారులను దిశా వేదికగా అడిగాడు. దిశకు తెలిపిన వివరాల ప్రకారం లైన్ మెన్ కు పలుమార్లు చెబితే ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నాడని డాబాపై ఎక్కాలంటే ఎక్కడ కరెంట్ తీగలు తాకుతాయో అని భయం భయంగా ఉందని ఇంటి యజమాని చెప్పారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే కంటే ప్రమాదం జరగక ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుందని యజమాని తమ గోడును వ్యక్తం చేశాడు.



Next Story