అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్ గోపి

by Disha Web Desk 20 |
అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్ గోపి
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని, రాష్ట్రస్థాయిలోనే మన జిల్లా ముందంజలో ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ చాలా చక్కగా జరగాలని, పిల్లల ఆరోగ్యం పైనే జిల్లా యొక్క అభివృద్ధి పథంలో దీర్ఘకాలికంగా ఉంటుందని గుర్తు చేశారు. శాఖ పరంగా పనిచేస్తున్న వివిధ కేంద్రాల గురించి సఖి బాల పరిరక్షణ విభాగం ఐసీడీఎస్ పోషణ అభియాన్ 1098 చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర అనుబంధ విభాగం నుంచి పూర్తిగా వివరాలు సేకరించి వారి పురోగతి పై ప్రతి నెల రివ్యూ జరుగుతుందన్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేయబడిన ప్రభుత్వ స్కూల్స్ లో అంగన్వాడి కేంద్రాల ఉన్నట్లయితే వారిని వాటికి కలరింగ్, చిన్న చిన్న రీపేరులు ఉన్నట్లయితే వాటికి కూడా ప్రతిపాదనలు సిద్దం చేసి పంపాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్. డీ డబ్ల్యూఓకి ఆదేశించారు. ఇకపై ప్రతి నెల మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామన్నారు. అంగన్వాడి కేంద్రాల మరమ్మత్తులు అవసరమైన చోట ఏర్పాట్లు చేయుటకు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఇక పై జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజి వాకడే ఈ శాఖను పర్యవేక్షిస్తారని వారు అన్నారు. వివిధ విభాగాలైన సఖి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్లైన్, 108 చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఓషన్ అభియాన్, ఐసీడీఎస్ శాఖలు తమ తమ పనితీరుపై రిపోర్టులు నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అంగన్వాడిలలో తప్పనిసరిగా చిన్నచిన్న మరమత్తులు చేయవలసిన అవసరం ఉన్నట్లు అయితే బడ్జెట్ అవసరం మేరకు లభ్యత మేరకు పరిశీలించి అభివృద్ధి కొరకు సహకరిస్తామని తెలిపారు. ప్రతి సెక్టార్లో ఐదు మోడల్ అంగన్వాడి సెంటర్లను తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరింత విస్తృతంగా పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశం లో పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ పవర్ ప్రెసెంటేషన్ ద్వారా శాఖ సక్సెస్ స్టోరీలను జిల్లా కలెక్టర్ కి వివరించారు. పిల్లల ఎత్తుకు తగిన బరువు పై, పౌష్ఠిక ఆహారం, ఆరోగ్యం పైన పూర్తి వివరాలను జిల్లాలోని మూడు నియోజక వర్గాల పరిధిలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాల ప్రగతి నివేదికను పవర్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ప్రతి నెల గ్రామంలో ని 0 నుండి 5 సంవత్సరాల పిల్లల ఎత్తు బరువులు అంగన్వాడి టీచర్ తప్పని సరిగా రికార్డ్ చేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా లో 1911 మంది పిల్లలు పోషక లోపానికి గురి అవుతున్నారని, వారికివ్వవలసిన సప్లిమెంటరీ సూపర్వైజర్ ఫీడింగ్ అందించాలని, సిపిడిఒ లకి, తల్లిదండ్రులకి పిల్లల ఎత్తు బరువుల మీద అవగాహన కల్పించాలని ఆదేశించారు.

జిల్లా బాలల పరిరక్షణ విభాగం తరపున లీగల్ ఆఫీసర్ రాచపల్లి సురేష్ కుమార్ మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 87 మందికి 40 లక్షల పైచిలుకు, అత్యాచారం కేసుల్లో బాధితులైన అమ్మాయిలకు ప్రభుత్వపరంగా జీవో ఎంఎస్ నెంబర్ 28 ద్వారా అర్హులైన వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. సఖి కోఆర్డినేటర్ శ్రీలత గారు వారి యొక్క పనితీరుపై రిపోర్ట్ సబ్మిట్ చేయగా , జిల్లా లో విస్తృతంగా సఖి సేవలపై ప్రచారం నిర్వహించాలని, బాధితులకు అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ సఖి నిర్వాహకులను ఆదేశించారు. చైల్డ్ లైన్ 108 జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వీరబాబు గారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా బాలల సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం కృషి చేస్తున్నామని తెలిపారు.

చిల్డ్రన్స్ పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నామని ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరంగల్ చైర్ పర్సన్ కే వసుధ సభను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో పిల్లల సంబంధించి అనేక రకాల సమస్యలు నమోదు అవుతున్నాయని వాటి పరిష్కారానికి బెంచ్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే ఎల్లోమెంట్ ప్రేమ, బాల్యవివాహాలు అనే ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. వీటి పరిష్కారానికి డీసీపీయు చైల్డ్ లైన్, డిటెబ్లో ఇతర ఉన్నత అధికారుల సహకారంతో కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సీడీపీఓలు సూపర్వైజర్లు పోషణ్ అభియాన్ సిబ్బంది దివ్యాంగుల సంక్షేమ శాఖ సఖి సిబ్బంది, డీసీపీయు విభాగం సిబ్బంది చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed