తాళం వేసిన రెండు ఇండ్లలో చోరీ

by Kalyani |
తాళం వేసిన రెండు ఇండ్లలో చోరీ
X

దిశ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లి గ్రామంలో బుధవారం మధ్య రాత్రి తాళం వేసిన రెండు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. బంధువుల ఇంటి వద్ద శుభకార్యము ఉండటంతో ఇండ్లకు తాళం వేసి వెళ్లడంతో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలో ఉన్న సీసీ ఫుటేజ్ లను చూడగా ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనం పై సమయం 2:17 గంటల నిమిషాలకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. గ్రామంలోని చాకలి కరెన్న ( గంగారాం), నిమ్మ భూమా ఇద్దరి ఇండ్లల్లో చోరీ జరిగినట్లు స్థానికులు గమనించి ఇంటి యజమానులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిమ్మ భూమా ఇంట్లో ఆరు తులముల వెండి, ఎలక్ట్రిక్ గ్రైండర్ ఎత్తుకు పోయినట్లు పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన చాకలి కారెన్న(గంగారాం) ఇంటిలో రూ. 5,000 పోయినట్లు పేర్కొన్నారు. వస్తువులన్నీ చిందరవందరగా పడేసినట్లు వివరించారు.Next Story

Most Viewed