అక్కడ కనిపించని ప్లీనరి సంబరాలు.. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడమే కారణమా..?

by Disha Web Desk 13 |
అక్కడ కనిపించని ప్లీనరి సంబరాలు.. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడమే కారణమా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతా అధికార పార్టీ సంబరంగా నిర్వహించింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపొంతరం చెందిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ప్లీనరిగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెల్సిందే. మంగళవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్లీనరి రూపంలో నిర్వహించారు. కానీ ఉమ్మడి జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో మాత్రం ప్లీనరి సంబరాలు కనిపించలేదు.

స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో ప్లీనరి నిర్వహించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లోనైనా లీడర్లు కూడా సంబరాలు నిర్వహించకపోవడంపై పార్టీలో ఏదో జరుగుతుందని చర్చ మొదలైంది. నిన్నటి వరకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ఔరంగాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో బిజీగా ఉన్నారు. సభ ముగియగానే అందరూ తమ ప్రాంతాలకు వెళ్లి బీఆర్ఎస్ మీటింగ్ లు నిర్వహించగా బోధన్ లో మాత్రం అలాంటి వాతావరణమే కనిపించలేదు.

ఇటీవల బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గా రాజకీయాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలతో ఈ నెలలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త కౌన్సిలర్ శరత్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహరం పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లిన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం నాటి ప్లీనరి నుంచి ఎవరు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. మిగితా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నా ఆయా ప్రాంతాలకే పరిమితమయ్యారని, నియోజకవర్గ స్థాయి ప్లీనరి ఊసే లేదని చెప్పవచ్చు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన బోధన్ లో వాటే ఊసేలేదు.

గతంలోనూ బీఆర్ఎస్ పార్టీ అధినేత పిలుపు సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు బోధన్ లో అంతగా నిర్వహించలేదని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినత్సోవం సందర్భంగా నిర్వహించే సమ్మేళనంను లైట్ గా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గత పది రోజులుగా ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ కోసం ఉన్నప్పటికీ మంగళవారం తన నియోజకవర్గంలో జరిగిన ప్లీనరిలో పాల్గొనడం విశేషం.

బోధన్ నియోజకవర్గంలో ఇటీవల ఇఫ్తార్ విందు కార్యక్రమా,నికి ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా చూసుకున్నారని పార్టీ ప్లీనరికి వచ్చే సరికి దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలే నిర్వహించాల్సి ఉండడంతో ఔరంగాబాద్ సభ నేపథ్యంలో నిర్వహించలేదని చర్చ జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్యే సతీమణి నాందేడ్ జిల్లాలో ఇఫ్తార్ విందులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నాందేడ్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బరిలో ఉంటారనే చర్చ కూడా మొదలైంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed