ఎనిమిది మందికి బీఆర్ఎస్ బీఫారంలు

by Disha Web Desk 15 |
ఎనిమిది మందికి బీఆర్ఎస్ బీఫారంలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారత రాష్ట్ర సమితి తరపున ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఫారాలను అందజేశారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్ కన్ ఫాం చేసిన సంగతి తెలిసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా బరిలో నిల్చోవడం ఖాయమైంది. ఇది వరకు ప్రకటించినట్లుగానే ఆదివారం కేసీఆర్ బీఆర్ఎస్ కు ఎన్నికల మేనిఫెస్టో ను ప్రవేశపెట్టారు. అనంతరం కేసీఆర్ బీఫారాలను అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఫారాన్ని తీసుకున్నారు. ఇటీవల మాత వియోగానికి గురైన మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఆయన బీఫారంను ఎమ్మెల్సీ కవిత అందుకున్నారు. అంతకుముందు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎమ్మెల్యేలతో కవిత తన నివాసంలో అల్పాహార విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అక్కడి నుంచి అందరూ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ లు బీఫారాలను అందుకున్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ తానే స్వయంగా బరిలో ఉండడంతో అక్కడ తన బీఫారంను స్థానిక, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు అందజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే

అభ్యర్థులకు మనమే గెలువబోతున్నామని సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. వచ్చే నెలలో అందరూ నామినేషన్ల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా సూచనలు చేశారు. ఈ నెల చివరి వారం నుంచే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభల గురించి చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై ప్రచార కార్యక్రమాలను పెంచాలని సీఎం కేసీఆర్ అందరూ సిద్దం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పై గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పనిలో పనిగా తమ నేతలకు కేసీఆర్ బీఫారాలను అందజేయడంతో ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed