బుస్సాపూర్ బ్యాంక్ చోరి కేసులో మరొకరి అరెస్టు

by Disha Web Desk 20 |
బుస్సాపూర్ బ్యాంక్ చోరి కేసులో మరొకరి అరెస్టు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చోరి కేసులో మరొకరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సీపీ కేఆర్.నాగరాజు తెలిపారు. శనివారం మెండోరా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుస్సాపూర్ గ్రామీణ బ్యాంక్ చోరి కేసులో ఏ4 సలీం మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లా వాడి దగ్గర ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి అతని టీం అక్కడికి వెళ్లి సలీంను పట్టుకున్నారన్నారు.

అతన్ని విచారించగా బుస్సాపూర్ బ్యాంక్ చోరిలో పాల్గొన్నది వాస్తవమేనని అంగీకరించాడని తలిపారు. సలీం ఉత్తర ప్రదేశ్ లోని బదవన్ జిల్లా కస్బా కాకరాల గ్రామానికి చెందిన వాడని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో దోచుకున్నారని తెలిపారు. గతంలో తమిళనాడులో ఖమ్మం, కరీంనగర్, ఆసిఫాబాద్, జగిత్యాల్, సిద్దపేట్, గుల్భార్గ ప్రాంతాల్లో బ్యాంకుల్లో చోరిలకు పాల్పడ్డారని తెలిపారు.

గతంలో బ్యాంకుల్లో దొంగతనం చేసిన సొత్తుతో ఇన్నోవా కారు కొనుగోలు చేసి సిద్దిపేట్ జిల్లాలోని కుకునూర్ పల్లి, మెండోరాలోని బుస్సాపూర్ బ్యాంక్ లో చోరి చేశారని సీపీ తెలిపారు. సలీం వద్ద నుంచి ఒక లారీ, 116 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. బ్యాంక్ దోపిడి కేసును చేదించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సీసీఎల్ సీఐ రాజశేఖర్, సీసీఆర్ బీ సీఐ ప్రతాప్, రవికుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్, ఎస్సైలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed