793 విద్యార్థుల గైర్హాజరు.. ఇంటర్ విద్యాశాకాధికారి రఘురాజ్..

by Sumithra |
793 విద్యార్థుల గైర్హాజరు.. ఇంటర్ విద్యాశాకాధికారి రఘురాజ్..
X

దిశ, నిజామాబాద్ సిటీ : గురువారం జరిగిన మొదటి సంవత్సరం గణితం-1బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 793 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రఘురాజ్ తెలియజేశారు. మొత్తం 95.2% మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 16,453 మంది విద్యార్థులకు గాను 15,660 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు.

వీరిలో జనరల్ 13,836 మందికి గాను 13,329 మంది హాజరుకాగా 507మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలియజేశారు. ఒకేషనల్ 2,167 మంది విద్యార్థులకు గాను 2,331 మంది విద్యార్థులు హాజరు కాగా 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, బోధన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధుమలంచ కళాశాల ఉషోదయ మహిళ జూనియర్ కళాశాల, ఉషోదయ జూనియర్ కళాశాల, విజయ సాయి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీచేసి సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరీక్షల నిర్వహణ కమిటీని సంప్రదించాలని ఆదేశించారు.

Next Story