అరబ్​ దేశంలో తప్పిపోయిన కామారెడ్డి జిల్లా వాసి

by Disha Web Desk 15 |
అరబ్​ దేశంలో తప్పిపోయిన కామారెడ్డి జిల్లా వాసి
X

దిశ, తాడ్వాయి : ఉన్న ఊళ్లో ఉపాధి లేక.. దేశం కాని దేశానికి వెళ్లి తప్పిపోయిన ఉదంతం ఇది. ఎన్నో ఆశలతో డబ్బు సంపాదించి, పిల్లలను బాగా చదివించాలని, సంతోషంగా జీవించాలని కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆచూకీ లభించకపోవడంతో అసలు బతికి ఉన్నాడో లెడో కూడా తెలియని దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. భార్యా పిల్లలు ఒంటరి వారైపోయారు. బాధితుడి భార్య తన భర్త ఆచూకీ కనిపెట్టండంటూ కాళ్లరిగేలా అధికారుల నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బంకొల్ల రంజిత్ వ్యవసాయ పనిచేసేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో గల్ఫ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అందుకు వెంకటేశ్వర్లు అనే ఏజెంట్ ను సంప్రదించాడు. గల్ఫ్‌కు వెళ్లేందుకు అవసరమయ్యే డబ్బును అప్పు చేసి సమకూర్చుకున్నాడు. 2024 మార్చ్ 4న దుబాయ్ లోని అరబ్ ఎమిరేట్స్‌లోని ముస్తఫా కాలనీకి 11 మందితో కలిసి వెళ్లారు. వారికి ఈగల్ కంపెనీలో హోటల్ క్లినింగ్ లో పని కల్పిస్తామని తీసుకెళ్లిన ఏజెంట్ నాలుగు రోజులు అయినా పని లేకపోవడంతో మార్చ్ 11 న బతుకు దెరువుకు వెళ్లిన వారిని ఇండియాకు పంపిస్తున్నట్లు తెలిపినప్పటికీ రంజిత్ రాకపోవడంతో సదరు ఏజెంట్ ను సంప్రదించామని తెలిపారు. దీంతో ఆ ఏజెంట్ ను నిలదీయడంతో సరైన స్పందన ఇవ్వకపోగా బాధితుని కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురించేస్తున్నాడని ఆవేదన వెళ్లగక్కారు. గల్ఫ్ లో ఉంటున్నా సన్నిహితులతో రంజిత్ ఆచూకీ కొరకు దుబాయ్ లోని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించామని అన్నారు. ఎంతో మంది గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తన భర్త ఆచూకీ లభించేలా కృషి చెయ్యాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ ను ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed