రికార్డ్ సృష్టించిన నిమ్స్ ఆసుపత్రి.. ఎందుకో తెలుసా..?

by Shiva Kumar |
రికార్డ్ సృష్టించిన నిమ్స్ ఆసుపత్రి.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. దేశంలోనే ప్రప్రథమంగా ఈ సంవత్సరం కేవలం ఎనమిది నెలల కాల వ్యవధిలో 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన 100 కిడ్నీల్లో 61 జీవన సంబంధితమైనవి, 39 మరణించిన వారి నుంచి మార్పిడి చేసినవి ఉన్నాయి.

ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా పథకం ద్వారా పేద రోగులకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. వైద్యులు 11, 12 ఏళ్ల వయసు గల గ్రహీతలతో 2 పీడియాట్రిక్ మార్పిడిని కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రి సర్జన్లు దాదాపు 1,600 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు నిర్వహించగా, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు నిర్వహించామని NIMS యూరాలజీ హెడ్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

Next Story