తెలంగాణలో మరో సర్వే సంచలనం.. అందరి అంచనాలు తారుమారు అయ్యేలా ఆ పార్టీకి అధిక సీట్లు!!

by Disha Web Desk 4 |
తెలంగాణలో మరో సర్వే సంచలనం.. అందరి అంచనాలు తారుమారు అయ్యేలా ఆ పార్టీకి అధిక సీట్లు!!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కీలక నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతూ వస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్‌తో మహిళల ఓట్లు తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు గాను రైతుల ఇష్యూను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక మోడీ హవానే నమ్ముకున్న బీజేపీ డబుల్ డిజిట్ కోసం ప్రయత్నిస్తోంది. అయోధ్య రామ మందిర అంశం తమకు ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అయితే పండగ వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చేలా సివిక్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ - 8, కాంగ్రెస్ -6, బీజేపీ - 2, ఎంఐఎం -1 స్థానాల్లో గెలుస్తాయని సర్వే తెలిపింది. ఇదే సంస్థ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ -40, కాంగ్రెస్ - 66, బీజేపీ -4, బీఎస్పీ-2, ఎంఐఎం-5, సీపీఐ -1 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది.

Next Story

Most Viewed