సిటీలో కొత్త పోలీస్​జోన్లు.. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ

by GSrikanth |
సిటీలో కొత్త పోలీస్​జోన్లు.. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్​పోలీస్​కమిషనరేట్​పరిధిలో కొత్తగా రెండు డీసీపీ జోన్లతోపాటు తొమ్మిది ఏసీపీ సబ్​డివిజన్లు, పది లా అండ్​ఆర్డర్​పోలీస్​స్టేషన్లను ఏర్పాటు చేస్తూ సోమవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర మండలం మినహా మిగిలిన అన్ని జోన్లలో మహిళా పోలీస్​స్టేషన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఇవి ఉమెన్స్​సేఫ్టీ వింగ్​పరిధిలోకి వస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్​జోన్లు ఉండగా.. కొత్తగా సౌత్​ఈస్ట్, సౌత్​వెస్ట్​జోన్ల చేరతాయి. ఏసీపీ సబ్​డివిజన్ల పరిధిలోకి వస్తే గాంధీనగర్​సబ్​డివిజన్(దోమలగూడ, లేక్​పోలీస్​స్టేషన్లు), చిలకలగూడ సబ్​డివిజన్​(వారాసిగూడ పోలీస్​స్టేషన్), ఉస్మానియా ఏసీపీ సబ్​డివిజన్, బేగంపేట ఏసీపీ సబ్ డివిజన్​(తాడ్​బన్​పోలీస్​స్టేషన్) తిరుమలగిరి ఏసీపీ సబ్​డివిజన్,​సైదాబాద్, గోల్కొండ ఏసీపీ సబ్​డివిజన్లు కూడా ప్రారంభిస్తారు.

కొత్త కుల్సుంపురా ఏసీపీ సబ్​డివిజన్(కొత్తగా గుడిమల్కాపూర్​స్టేషన్), ఛత్రినాక ఏసీపీ సబ్​డివిజన్​ను కూడా ప్రారంభించనుండగా.. మాసాబ్​ట్యాంక్​స్టేషన్ బంజారాహిల్స్​ఏసీపీ డివిజన్​లో ఉంటుంది. జూబ్లీహిల్స్​ఏసీపీ సబ్ డివిజన్ (కొత్తగా ఫిలింనగర్​స్టేషన్) రానుంది. సంజీవరెడ్డినగర్​ఏసీపీ డివిజన్​కూడా కొత్తగా రానుండగా(కొత్తగా బోరబండ స్టేషన్)​వస్తుందని వివరించింది. కొత్తగా రహమత్​నగర్​స్టేషన్​ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. నూతనంగా ఉమెన్స్​సేఫ్టీ వింగ్​ప్రారంభం కానుందని, దీని పరిధిలోకి సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సౌత్​వెస్ట్​జోన్లలో కొత్తగా ఏర్పాటయ్యే మహిళా పోలీస్​స్టేషన్లు వస్తాయని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed