జంతు ప్రేమికురాలి తీరుపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే..?

by Disha Web Desk 19 |
జంతు ప్రేమికురాలి తీరుపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వీధి కుక్క చావుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పంజాగుట్ట డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను తీసుకువెళ్లారు. స్టెరిలైజేషన్ తర్వాత వాటిని అదే కాలనీలో విడిచిపెట్టారు. అయితే వీటిలో వీటిలో రెండు కుక్కలు అస్వస్థతకు గురి కాగా ఇందులోని ఓ కుక్క చనిపోయింది.

దీంతో కుక్క మరణానికి జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, వెటర్నరీ అధికారులు చక్రపాణిరెడ్డి, సూర్యకిరణ్, సబితా రెడ్డి, డాగ్ క్యాచర్ దీపక్‌పై కేసు నమోదు చేయాలని కళానిధి పర్వత వర్ధనమ్మ అనే జంతు ప్రేమికురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిపై జంతు హింస కింద కేసు నమోదు చేయాలని కోరింది. అయితే వర్ధనమ్మ ఫిర్యాదుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు.

Next Story