కంట్రోల్ రూమ్ నెంబర్లు పనిచేస్తలే..పోలీసులకు నెటిజన్ రిక్వెస్ట్

by Disha Web Desk 13 |
కంట్రోల్ రూమ్ నెంబర్లు పనిచేస్తలే..పోలీసులకు నెటిజన్ రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారులు అనేక మార్పులు తీసుకువస్తున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ఆపద సమయాల్లో సులువుగా సంప్రదించేలా హెల్ప్ లైన్ నెంబర్లను ఆన్ లైన్ లో పబ్లిక్ కు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అలా ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ ల ప్రకారం అధికారులకు కేటాయించిన ఫోన్ నెంబర్లు, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండటం లేదని ఓ నెటిజన్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. చాలా ఫోన్ నెంబర్లు ఉనికిలో లేవని మరికొన్ని పని చేయడం లేదని ఎవరైనా సాయం కోసం ప్రయత్నించే బాధితులకు ఈ పరిస్థితి సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ నెంబర్లను వెబ్ సైట్లలో అప్ డేట్ చేయాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు రియాక్ట్ అయింది. సదరు నెటిజన్ విజ్ఞప్తిని తెలంగాణ స్టేట్ పోలీస్ ఖాతాకు ట్యాగ్ చేశారు.


Next Story

Most Viewed