తెలంగాణ ఐటీ అధికారుల నిర్లక్ష్యం.. ఇంకా కేటీఆర్‌ పేరే కంటిన్యూ!

by Disha Web Desk 2 |
తెలంగాణ ఐటీ అధికారుల నిర్లక్ష్యం.. ఇంకా కేటీఆర్‌ పేరే కంటిన్యూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం మేటి అని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా అప్‌డేట్ కావడంలో మాత్రం తొందరేముంది అనే తీరులో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ నెల 3వ తేదీన రాజీనామా చేయడం, దానికి గవర్నర్ ఆమోదం తెలపడంతోనే మొత్తం మంత్రివర్గం రద్దయిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ తరఫున అధికారికంగా నిర్వహించే ట్విట్టర్ (ఎక్స్)లో మాత్రం ఇంకా ఆ శాఖ మంత్రి కేటీఆర్ అనే తీరులోనే కొనసాగుతున్నది.

అన్ని శాఖలకంటే స్పీడ్‌గా ఉండాల్సిన ఐటీ శాఖ నిదానంగా పనిచేస్తున్నదా?.. లేక నిర్లక్ష్యంగా ఉన్నదా అని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆ శాఖలకు మంత్రిగా ఇంకా ఎవరికీ కేటాయింపు చేయకపోయినా కేటీఆర్ పేరును ఎలా కొనసాగిస్తారన్నదే కీలకంగా మారింది. ఇంతకాలం అధికారులు కేటీఆర్ సేవలో తరించి ఇప్పటికీ ఆయన పేరునే కొనసాగించాలని కోరుకుంటున్నారా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed