కారు గుర్తుకు ఓటు వేయండి మీ సేవకుడిగా పని చేస్తా : సైదిరెడ్డి

by Naresh N |
కారు గుర్తుకు ఓటు వేయండి మీ సేవకుడిగా పని చేస్తా : సైదిరెడ్డి
X

దిశ, చింతలపాలెం: కారు గుర్తుపై ఓటు వేయండి మీ సేవకుడిగా పని చేస్తా అని హుజూర్నగర్ నియోజకవర్గ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. చింతలపాలెం మండల కేంద్రంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయనతో పాటు కాసోజు శంకరమ్మ, బాణోత్ రమణా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ... ఈ నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి మీ సేవకుడిగా పని చేస్తాను అని కోరారు. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. మీ ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటదో ఆలోచించి ఓటు వేయాలి.

హుజుర్ నగర్ లో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం అని అన్నారు. గత పాలకుల హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు, కాలనీలు, ఇప్పుడు చాలా అభివృద్ధి చెంది మంచిగా ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టామని రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి సీఎం కేసీఆర్ ను గెలిపించుకొని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఆ తర్వాత గుడిమల్కాపురం , గాంధీ నగర్ తండా , దొండపాడు గ్రామంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త మద్ది వెంకటరెడ్డి, ఎంపీటీసీలు సైదిరెడ్డి, మహత్యం, తోట సంధ్య, అన్ని గ్రామాల సర్పంచులు , మండల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed