వేముల దారెటు..? నేడు అనుచరుల సమావేశంతో ఉత్కంఠ

by Disha Web Desk 6 |
Former MLA Vemula Veeresham
X

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నకిరేకల్ నియోజకవర్గం నుంచి 2014 లో మొదటిసారి వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం చిరుమర్తి లింగయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉప్పు నిప్పుల ఉండిపోయారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఒక వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. ఇరు వర్గాలు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఒకరి దగ్గర మరొకరు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నప్పటికీ వే ముల వీరేశం తనకే టికెట్ వస్తుందని ఆశతో ఇంతకాలం తన అనుచరులను కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు.

కానీ రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మా జీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యామ్నయం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంతకాలంగా వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడని చాలా ఊహాగానాలు రావడం, దానిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఏనాడు పార్టీ మారుతున్నట్లు తన ప్రకటించలేదు. అయితే కార్యకర్తలు మాత్రం తాను ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే తన కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించారని వాళ్లు కూడా చేరడానికి అంగీకారం తెలిపారని అందుకోసమే పదేళ్లుగా వెన్నంటి ఉన్న కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

10 వేల మందితో సమావేశం..

రానున్న ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడు నకిరేకల్ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో సుమారు పదివేల మందికి పైగా సమావేశం కానున్నారు. ఇందు లో సుమారు 50 మందికి పైగా ప్రజాప్రతినిధులు 100 మందికి పైగా పార్టీ పదవులు అనుభవిస్తున్న వాళ్లు సమావేశానికి రానున్నట్లు తెలిసింది. అంటే నేటి సాయంత్రం వరకు వీరేశం ఏ పార్టీలో చేరే అవకాశముందు స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. తమ నాయకుడు తీసుకునే నిర్ణయం కోసం శ్రేణులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

రేపు ఢిల్లీకి పయనం..?

ఇంతకాలం అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందని భావించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు రెండు రోజుల క్రితం అధికార పార్టీ అధినేత చిరుమర్తి లింగయ్యకు సీటు ఇవ్వడంతో దారులు మూసుకుపోయాయి. దాంతో ప్రత్యామ్నయం చూసుకునే పనిలో లీనమయ్యారు. అందులో భాగంగానే రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్న ట్లు సమాచారం. అత్యంత ముఖ్యమైన అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. వీలైతే అక్కడే పార్టీ పెద్దల చేత జండా కప్పుకుని తిరిగి రానున్నట్లు సమాచారం. ఇక్కడికి వచ్చిన త ర్వాత నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్లో చేరితే వీరేశం విజయం ఖాయమని చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. చివరికి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇక వేచిచూడాల్సిందే మరి.



Next Story

Most Viewed