డాక్టర్ ఉండరు... నర్సులు పట్టించుకోరు

by Kalyani |
డాక్టర్ ఉండరు... నర్సులు పట్టించుకోరు
X

దిశ, మఠంపల్లి: మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్కడ అధికారులు చిన్న చూపు చూడడమే గాక వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల క్రితం వైద్యం వెళ్లిన రోగి పట్ల దురుసుగా మాట్లాడమే గాక అతని పై దాడి చేసిన సంఘటన మరువక ముందే మంగళవారం రాత్రి రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. మండలంలోని బక్క మంతుల గూడెం వద్ద అదేవిధంగా సాగర్ సిమెంట్స్ సమీపంలో యాక్సిడెంట్లు జరుగగా క్షతగాత్రులను కొందరు యువకులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా అక్కడ వైద్యుడు లేడు డ్యూటీ లో ఉన్న నర్సు అరుబయట కూర్చో పెట్టి చికిత్స చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రి కంటే ప్రైవేట్ ఆసుపత్రి లే నయం అంటూ ఉండగా క్షతగాత్రులు నోరువెల్లబెట్టారు. ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి రోగులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లకుండా అరుబయట చికిత్స చేయడం డాక్టర్ అందుబాటులో లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story