దేశంలో ఎర్రకోటపై ఎగరవేయబోయేది కాంగ్రెస్ జెండానే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 11 |
దేశంలో ఎర్రకోటపై ఎగరవేయబోయేది కాంగ్రెస్ జెండానే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఎర్రకోటపై ఎగరవేయబోయేది కాంగ్రెస్ జెండాయేనని నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎన్నికల అనంతరం ప్రధానిగా రాహుల్ గాంధీ ఖాయం కానున్నారని ఆయన జోస్యం చెప్పారు. అందుకు పార్టీ అభ్యర్దుల గెలుపులో కష్టపడ్డ కార్యకర్తకే సుస్థిర స్థానం దక్కనుందని మంత్రి భరోసా ఇచ్చారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ దే విజయం సాధిస్తుందని, అయినప్పటికీ ఈ ఎన్నికలో మెజారిటీలో కాంగ్రెస్ సత్తా చూపించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీ లను వేస్తున్నట్లు చెప్పారు. మా ప్రభుత్వంలో ప్రతి పేద వారికి ఇళ్లు కట్టించబోతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఇళ్లు కటిస్తామని హామీ ఇచ్చారు. అందుకు ఎవరైతే పార్టీ కోసం మెజారిటీ తెస్తారో వారికి ఇందిరమ్మ కమిటీలో స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు.ఆరు గ్యారెంటీలతో పాటు ఇందిరమ్మ కమిటీలోని మెంబర్లకు రూ.6 వేలు ఇస్తామని చెప్పారు.

అయినా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఉద్దేశ్యంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా అత్యధిక స్థానాలను గెలిపించాలని హితువు పలికారు. ఇందుకోసం ప్రతి బూత్ నుంచి 50 మందిని కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు..అనంతరం మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే మెజారిటీలో మన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే పోటీ అని కితాబిచ్చారు. అంతే కాకుండా పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి తనకి సోదరుడిని,ఆయనతో నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Next Story