కేసీఆర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడటం హాస్యాస్పదం : ఉత్తమ్

by Disha Web Desk 22 |
కేసీఆర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడటం హాస్యాస్పదం : ఉత్తమ్
X

దిశ, నేరేడుచర్ల: సీఎం కేసీఆర్ నిన్న కోదాడలో నిర్వహించిన బహిరంగ సభలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 60 ఏళ్ల క్రితం కడితే ఇప్పటికీ అది దృఢంగా ఉంది. దాని ద్వారా లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. కానీ మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొన్ని నెలలకే కుంగి పోయిందంటే మీరు కట్టిన పనితీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చుపెట్టి వేల కోట్లు దోచుకున్నారని మీ దోపిడీకి నిదర్శనం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడమే అన్నారు. నాగార్జున సాగర్‌లో నీరు ఉండి కూడా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పొలాలు ఎండిపోతుంటే అది చూసి మీరు సిగ్గుపడాలన్నారు. సాగర్ నీరు సరిగా రాక విద్యుత్ సక్రమంగా ఇవ్వక రైతులు వేసిన వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని అది మీ నిస్సాహయతకు నిదర్శనమన్నారు. రైతులకు సరిగా నీరు, విద్యుత్ అందించకపోవడం వలనే రైతులు నష్టపోయారని ఆ రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలని కోరారు. సోనియాగాంధీ ధృడ సంకల్పంతోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.

కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుందని, కానీ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కేసీఆర్ అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణలో 90 శాతం మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి అధికారం చేపట్టబోతుందని తెలిపారు. 2024 మే లో రాహుల్ ప్రధాని కాబోతున్నారని తెలిపారు. అలాగే హుజూర్‌నగర్‌ లో కూడా అరాచక పాలన నడుస్తుందని అక్కడ కేసీఆర్ ని, ఇక్కడ సైదిరెడ్డిని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాముల శివారెడ్డి, ఎర్రగాని నాగన్న గౌడ్, పట్టణ అధ్యక్షులు మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ గూడెం శీను, నాయకులు గిల్లి రవి, మోడెం గోపిరెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed