హక్కుల సాధనకు వీఆర్ఏల పోరుబాట

by Disha Web |
హక్కుల సాధనకు వీఆర్ఏల పోరుబాట
X

దిశ, మునుగోడు: వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి 80 రోజుల సమ్మె చేయగా ఇటివల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చి నేటికి 3నెలలు దాటిన రాష్ట్ర ప్రభుత్వం స్ఫందించకపోవడం దారుణమని వీఆర్ఏల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.విజయ్ అన్నారు. బుధవారం తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి ఆద్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మునుగోడు నుండి యాదాద్రి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నికలు అయిన తర్వాత వీఆర్ఏల హామీలను నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చకుండా మళ్ళీ ఒకసారి మోసం చేసిందని, ఎక్కడైతే సమ్మె ఆపామో మళ్లీ అదే మునుగోడు నుండి పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో సిఎం కేసిఆర్ ప్రకటించిన పేస్కేల్ జివోను వెంటనే విడుదల చేయాలన్నారు.





అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు.55సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.80రోజుల సమ్మెకాల వేతనాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వాలకు వీఆర్ఏలు వ్యతిరేఖం కాదని తమ హక్కుల సాదనకై పోరుబాట పట్టామన్నారు.పాదయాత్ర అనంతరం 12వ తేదీన యాదగిరిగుట్టలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీదర్ గౌడ్, రాష్ట్ర కో-కన్వీనర్లు కావలి సత్యనారాయణ,ముదాం చిరంజీవి, సంఘం నాయకులు స్వరూప, శోభ,నర్సింహరావు,నార్ల శ్రీనివాస్,మాదవిగౌడ్, లక్ష్మల నర్సింహ్మ, ధనసూర్య, తదితరులు పాల్గోన్నారు.

Next Story

Most Viewed