గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి: ఏఐటీయూసీ నేత

by Dishafeatures2 |
గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి: ఏఐటీయూసీ నేత
X

దిశ, మునుగోడు: గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మునుగోడు మండలంలోని కచిలాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐఎల్ఓ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్తి పంట ముఖ్యపాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు, 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు.

కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతోందని అన్నారు. పిల్లలను బడికి పంపాలని, పనిలో పెట్టుకోవడం చట్టరిత్యా నేరమని పేర్కొన్నారు. అసంగటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. గ్రామీణ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురిజ అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోల్గురి నర్సింహ, ఐఎల్ఓ ప్రాజెక్ట్ రాష్ట్ర పరిశీలకులు గౌతం, అరుణ, ఏఐటీయూసీ మండల కో ఆర్డినేటర్ చాపల శ్రీను, నాలపరాజు సతీష్ కుమార్, గిరి రమా, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న, కార్యదర్శి బెల్లం శివయ్య, శంకర్, పద్మ, నర్సింహ, సంతోష, ఎల్లమ్మ, దనమ్మ, సైదమ్మ, భాగ్యమ్మ, యశోద, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed