- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైద్యుల నిర్లక్ష్యం తో రోగి మృతి
దిశ, మిర్యాలగూడ: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వన్ టౌన్ పోలీసులు కు బాధిత కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం ..దామరచర్ల మండలం ,రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్ మల్లు నాయక్ (43) అనారోగ్య కారణాలతో ఈ నెల 26న పట్టణంలోని అంకిత ఆసుపత్రిలో చేరగా సోమవారం ఉదయం స్కానింగ్ కోసం పంపారు. అక్కడ కళ్లు తిరిగి పడిపోయిన మల్లు ని ఆసుపత్రి కి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన డాక్టర్, అత్యవసర సేవలందించే బాలాజి హాస్పిటల్ కి అంబులెన్సు లో తరలించాడు. అప్పటికే మల్లు మృతి చెందగా, మల్లు మృతి విషయాన్ని రెండు ఆసుపత్రుల నిర్వాహకులు చాలా సేపటి వరకు బయటకు చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్లు మృతి చెందాడని ఆందోళన చేశారు. న్యాయం చేస్తామన్న వైద్యుల హామి మేరకు ఆందోళన విరమించారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు