పేపర్ లీకేజీ దోషులను అరెస్ట్ చేయాలి: బీజెపి జిల్లా అధ్యక్షుడు

by Dishaweb |
పేపర్ లీకేజీ దోషులను అరెస్ట్ చేయాలి: బీజెపి జిల్లా అధ్యక్షుడు
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: గ్రూప్ వన్ పేపర్ లీకేజీ దోషులను వెంటనే అరెస్టు చేయాలని సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి మాట్లాడుతూ లక్షలాది నిరుద్యోగ యువత ఆశలను నీరుగా చుతూ లీకేజీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తలుగుతుందని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనలో నిరుద్యోగులకు రూ.1 లక్ష పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీపీ ఎస్సి లీకేజీ పై బాధ్యత వహించి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలన్నారు. లీకేజీ దోషులను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏవో శ్రీదేవికి బీజేపీ నాయకులు మెమోరాండం అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర మల్లె పాక సాయిబాబా అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ కాపా రవి కుమార్ కనగల నారాయణ పట్టణ అధ్యక్షుడు అబీబ్ జిల్లా నాయకులు తుక్కని మన్మధ రెడ్డి, చలమల నరసింహ బూర మల్సూర్ కట్కూరి కార్తీక్ పగిళ్ళ సుశీందర్ రెడ్డి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.Next Story