వైద్యాధికారులకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు

by Disha Web Desk 12 |
వైద్యాధికారులకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, మర్రిగూడ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు పాత బిల్డింగ్‌లోనే కొనసాగించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. శనివారం వైద్య సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన వైద్య సిబ్బందికి కీలక ఆదేశాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని పదోన్నతి చేస్తూ 30 పడకల ఆరోగ్య కేంద్రంగా మార్చారు. ఈ నేపథ్యంలో సుమారు ఐదు కోట్ల నిధులతో కొత్త బిల్డింగును నిర్మించారు. బై ఎన్నికలు ముగిసిన అనంతరం గత జనవరి మూడో తేదీన కొత్త బిల్డింగులు ప్రారంభించారు.

30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సేవలు నిలుపుదల చేస్తూ 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు మండలంలోని శివన్నగూడ గ్రామంలో కొత్త బిల్డింగును ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కానీ నేటికీ అక్కడ బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అందుబాటులో లేవు. కానీ పీఎస్‌సీ వైద్య సిబ్బంది సీఎస్సీ వైద్య సిబ్బంది వేరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పీహెచ్‌సీ డీఎం అండ్ హెచ్‌ఓ పరిధిలో ఉండగా సీఎస్సీ వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం మొత్తంగా పీహెచ్‌సీ, సీఎసీసీ వైద్య సిబ్బంది కొత్త బిల్డింగ్‌లోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పీహెచ్సి వైద్య సిబ్బంది పాత బిల్డింగ్‌లోనే రోగులకు వైద్య సేవలు అందించాలని సీహెచ్సి వైద్య సిబ్బంది కొత్త బిల్డింగ్‌లోనే వైద్య సేవలు అందించాలని మునుగోడు ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో నేటి నుంచి వైద్య సేవలు రోగులకు రెండు భవనాలలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మర్రిగూడ లో రెండు సెంటర్లు పని చేయాల్సిందే

మర్రిగూడ మండల కేంద్రంలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం రెండు కూడా రోగులకు వైద్య సేవలు అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు అయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 సంవత్సరాల కిందట రోగులకు అన్ని రకాల సేవలు అందించాలని అలాంటి బిల్డింగులు ఎందుకు వైద్య సేవలు అందడం లేదని ఆరా తీశారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయాల్సిన వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు అందించాలని కొత్త బిల్డింగ్‌లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీఎస్సీ సేవలు రోగులకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు.

రెండు కేంద్రాలు ఒకే దగ్గర పని చేయడంతో కొంతమంది సిబ్బంది చేయాల్సిన సేవలు రోగులకు అందాల్సిన వైద్యం అందుబాటులో లేదని ఇకనుంచి రోగులకు వైద్యులకు కావలసిన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేస్తానని ఎవరు ఎక్కడికి కేటాయించబడ్డారో అక్కడనే డ్యూటీ చేసి రోగులకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఇకనుండి మండల కేంద్రంలో సిఎస్సి సేవలు పిహెచ్సి సేవలు రోగులకు అందనున్నాయి.

Next Story

Most Viewed