నీటి కోసం వానరం పాట్లు…

by Disha Web Desk 11 |
నీటి కోసం వానరం పాట్లు…
X

దిశ, నాగార్జునసాగర్ : అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల బాట పట్టాయి. ఆకలితో అలమటిస్తూ తమ కడుపు ఎవరు నింపుతారేమోనని ఎదురుచూస్తున్నాయి. ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మూగజీవులకు అటవీ ప్రాంతంలో ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగడానికి నీరు లేక, పండ్లు ఫలాలు లేక మూగజీవులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వానరం తాగి పడేసిన వాటర్‌ బాటిల్‌ తీసుకొని, అందులో ఉన్న నీటిని తాగి కడుపు నింపుకున్న చిత్రం ఇది. ఈ సంఘటన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

ఈ నెల ఏప్రిల్ మూడో తేదీన తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30 కోతులు మృతి చెందాయి. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన వానరాలకు బయటకు వచ్చే దారి దొరక్క.. అందులోనే మృతి చెందిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు మాత్రం కోతులకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed