మునుగోడులో ఆ సమస్యను తరిమికొట్టిందే కేసీఆర్: మంత్రి జగదీష్ రెడ్డి

by Disha Web Desk 19 |
మునుగోడులో ఆ సమస్యను తరిమికొట్టిందే కేసీఆర్: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, చండూరు: మునుగోడులో ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలంలో మంజూరైన ఆసరా పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా పాలించిన పాలకులు మునుగోడు ప్రజలను ఫ్లోరోసిస్‌ నుండి కాపాడలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అది సాధ్యమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని పేర్కొన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పెన్షన్ రూ. 600 ఇస్తుంటే.. తెలంగాణలో రూ. 2016 ఇస్తున్నారన్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆకలితో చనిపోతుంటే ఆ దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమివేసింది కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, చేనేత భీమా పథకాలను ప్రవేశపెట్టి ప్రజల సమస్యలను తీరుస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండి ఆయన నాయకత్వాన్ని బలపర్చలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటి రెడ్డి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, సర్పంచ్‌లు ఇడెం రోజా, విరమల్ల శ్రీశైలం, ఎంపీటీసీలు అవ్వారి గీతా, శ్రీనివాస్, గొరిగి సత్తయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed