డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా ఈరోజు మ. 3 గంటలకి...

by Dishanational1 |
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా ఈరోజు మ. 3 గంటలకి...
X

దిశ, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డ్రా తీయనున్నారు. నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కొరకు వచ్చిన 13,230 ధరకాస్తులను వివిధ మండలాల్లో పని చేసే పంచాయతీ రాజ్ మరియు రెవెన్యూ సిబ్బందితో రికార్డ్ స్థాయిలో 5 రోజులలో ఎంక్వైరీని పూర్తి చేయించి, 4,692 మందిని ప్రాథమికంగా అర్హులుగా నిర్ధారించారు. అర్హులుగా తేలిన ఈ 4692 మంది వివరాలను 2 రోజుల క్రితం హైదబాద్ లోని మీసేవ కేంద్రాలను నిర్వహించే తెలంగాణ టెక్నోలోజికల్ సర్వీసెస్ వారికి పంపించారు. వారు దరఖాస్తు దారుల ఆధార్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ వివరాల ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల వెబ్సైట్ లలోని వివరాలతో ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా విచారించారు.

గతంలో ఇందిరమ్మ పొందినవారిని, ప్రభుత్వ ఉద్యోగులని, కార్, ట్రాక్టర్ లు ఉన్నవారిని గుర్తించి, 487 మందిని తొలిగించి, 4205 మందికి క్లియరెన్స్ ఇచ్చింది. వీరిలో ఎంక్వైరీ అధికారులు, ప్రభుత్వ వెబ్సైట్ గుర్తించని కొంతమంది అనర్హులు ఉండే అవకాశం కలదు. అలాంటి వారు కనుక ఉంటే, అభ్యంతరాలు తెలియజేస్తే వారిని , విచారించి తొలగించారు. ఈ జాబితాలోని వారిని వార్డు వారీగా రేపు 3 గంటలకు, వార్డు కు సమీపంలోని 12 function hallsలలో డ్రా తీసి వార్డుకు 11 మంది చొప్పున ధరఖాస్తుదారుల సమక్షంలోనే ఎంపిక చేయనున్నారు. డ్రా తీసే పక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు, పూర్తి పారదర్శతతో డ్రా తీయనున్నారు. డ్రాలో ఎంపిక అయినవారి అర్హతను మరొకసారి తహశీల్దార్ ల ఆధ్వర్యంలో క్షుణ్నంగా విచారించి, 100 శాతం అర్హులు అని తెలిన తరువాతే వారికి పట్టా తరువాత అందజేయబడుతుంది అని, అనర్హులు అని తేలితే వారిని తొలగించి, వారి స్థానంలో పూర్తి అంగవైకల్యం గల వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం అందజేయపడుతుందని, ఎలాంటి రాజకీయ వత్తిడి, పైరవీలు లేవని, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శక పక్రియలో, అత్యంత పకడ్బందీగా నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.

Next Story

Most Viewed