మండల సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధుల కొరత

by Dishaweb |
మండల సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధుల కొరత
X

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలం సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఇటీవల మరణించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రేమ్ సింగ్ కు సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు ‌. అనంతరం ప్రభుత్వలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలుపై అధికారులు చర్చ చేపట్టగా ఆ శాఖల అధికారులు వారి యొక్క శాఖాపరమైన అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలు అంశాలపై వేడి వాడి చర్చ జరిగింది. మండలం లో 14 గ్రామపంచాయతీలు ఉండగా నలుగురు సర్పంచులు 12 మంది ఎంపీటీసీలు ఉండగా ఇద్దరు మాత్రమే సమావేశానికి హాజరు కావడం. ప్రజల సమస్యలను అధికారుల ద్వారా ప్రభుత్వం కి చేరవేయవలసిన ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొనకపోవడం , మండల కేంద్రంలో పనిచేస్తున్న వివిధ శాఖలు అధికారులు సమావేశంలో గైర్హాజరయ్యారు.

8 శాఖలకు సంబంధించి గణాంకాలను సభలో చదివి వినిపించటం మిగిలిన శాఖలు సభకు రాకపోవడం .కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్, పోడు భూములు వంటి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నెలల గడుస్తున్న చేపట్టకపోవడం వీటిపై అధికారుల నుండి సరైన సమాధానం రావడం లేదని పలువురు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు . ముఖ్యంగా మిషన్ భగీరథ, అటవీ శాఖ, విద్యుత్ శాఖ విద్యాశాఖ. ఎక్సైజ్, పరిశ్రమలు వంటి పలు శాఖలు పనితీరుపై సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చాగమ రెడ్డి పద్మ, వైస్ ఎంపీపీ గోపిరెడ్డి, అధికారులు ఎమ్మార్వో దామోదర్ రావు, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్,ఎం పి ఓ వీరయ్య, విద్యుత్, ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story