ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసిఆర్ దే : కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసిఆర్ దే : కోమటిరెడ్డి
X

దిశ ,మోత్కూరు: 10 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించినది అంతా కక్కాల్సిందే నని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ దుకాణం మూసుకోవాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఉన్నత పాఠశాల చౌరస్తాలో ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ… బీఆర్ఎస్ నాయకులు తాను హోం మంత్రి కావద్దని నిత్యం దేవుని మొక్కుతున్నారని, నేను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

వారు ఇచ్చిన హామీలను పదేళ్లుగా నెరవేర్చకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తనకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పనిచేస్తున్నానన్నారు. ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే ఉమ్మడి జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎంపీ అభ్యర్థి చాపల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని అందులో 500 కోట్లు కేటాయిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని అర్థంతరంగా ఆగిపోయిన భూనాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి తదితర చిన్న నీటి వనరులు పూర్తయితే రైతులు సంతోషంగా ఉండేవారని, తనను ఎంపీగా గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తే ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి ఈ ప్రాంత వనరులను దోచుకున్నాడని, అందుకే గత ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో గతంలో పనిచేసిన ఎంపీ బూర నర్సయ్య నియోజకవర్గంలో లక్ష రూపాయల పని చేశానని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందిరానగర్ నుంచి ఉన్నత పాఠశాల చౌరస్తా వరకు ర్యాలీ భారీ ఎత్తున కొనసాగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, లక్ష్మి నరసింహారె,డ్డి వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, పైళ్ల సోమిరెడ్డి,అవిశెట్టి ఆవిలిమల్లు, పన్నాల శ్రీనివాసరెడ్డి పోలినేని ఆనందమ్మ, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, అనుబంధాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed