గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

by Disha Web Desk 20 |
గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
X

దిశ, మోత్కూరు : మున్సిపల్ కేంద్రాల్లోని గ్రంథాలయ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మోత్కూరు శాఖా గ్రంథాలయానికి ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సంస్థ నుండి 10 లక్షలు మంజూరు చేసిన నిధులతో అదనపు భవనం హాల్ నిర్మాణానికి, ఆయిల్ఫడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్నపుస్తకాలు, గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య వివరాలు అడిగారు. నేటియువత, విద్యార్థులు, విద్యావంతులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తీపిరెడ్డి సావిత్రీ మేఘా రెడ్డి, వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, మార్కేట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు కళ్యాణ్ చక్రవర్తి, లెంకల సుజాత, దబ్బెటి విజయా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్, రైసస మండల కో ఆర్డినేటర్ కొండ సొంమ్మల్లు, కల్వల ప్రకాష్ రాయుడు, గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, జంగ శ్రీను, కందుల విక్రాంత్, కంచర్ల క్రాంతి రెడ్డి, తిరుమలేశు, పరమేష్, ప్రవీణ్, ఎం.డి.అయాజ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గణగాని నరసింహ, పొలినేని ఆనందమ్మ ఎం.డి.శాహాన, గ్రంథాలయ వైస్ చైర్మెన్ పోలినేనిస్వామిరాయుడు, డైరెక్టర్లు, లైబ్రరీ ఇంచార్జీ, మాజీ సర్పంచ్ నాయకులు రఘుపతి, పురుగుల మల్లయ్య, నల్ల ప్రభాకర్, బలెంల మధు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మల్లం అనిత, కట్ట ఇంద్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మున్సిపల్ కేంద్రంలో నూతన భవనంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి..

ఆధ్యాత్మిక చింతను అలవర్చుకుంటే సమస్యలను ఎదుర్కోవడంతో పాటు పరిష్కార మార్గాలను కనుగొనే వీలుంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని అనాజిపురంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మెగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పుణ్యమైన రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed