Free Electricity : కాంగ్రెస్ పార్టీకి రైతులే తగిన గుణపాఠం చెబుతారు: Bollam Mallaiah Yadav

by Dishaweb |
Free Electricity : కాంగ్రెస్ పార్టీకి రైతులే తగిన గుణపాఠం చెబుతారు: Bollam Mallaiah Yadav
X

దిశ, కోదాడ: రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా అనంతగిరి మండల కేంద్రంలో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించి, దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమన్నీ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడని అన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు కి రాబోయే ఎన్నికలలో రైతులే కరెంట్ షాక్ ఇస్తారని పేర్కొన్నారు. మొన్న ధరణి వద్దన్నారు, నేడు ఉచిత విద్యుత్ వద్దంటున్నారు, రేపు రైతు బందు, రైతు భీమా వద్దంటారు.

24 గంటల ఉచిత కరెంట్ రద్దు చేసి... 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ట అని ఆయన తెలిపారు.రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిది.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణం అని ఆయన అన్నారు.కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలి. ఖాబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతంగానికి రేవంత్ రెడ్డి వేంటేనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వేనేపల్లి వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, మండల ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More : కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 చెరువుల నీళ్లు తాగినా.. మూడోసారి అధికారంలోకి రావడం కలే : Revanth Reddy



Next Story

Most Viewed