ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : కలెక్టర్

by Disha Web Desk 11 |
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : కలెక్టర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగె సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని, తమ పరిధిలోని రూట్ మ్యాప్ లపై అవగాహన ఉండాలని, సెక్టోరియల్ అధికారుల విధి విధానాల హ్యాండ్ బుక్స్ లోని నియమాలను, మార్గదర్శకాల పట్ల క్షుణంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా, ఓటింగ్ శాతం పెరిగేలా స్వీప్ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. పోలింగ్ విధానంలో రిటర్నింగ్ ఆఫీసర్ కు ప్రిసైడింగ్ ఆఫీసర్ కు మధ్య అనుసంధానకర్తగా సెక్టోరియల్ అధికారి ఉంటారని, వారి ఆధీనంలో 12 పోలింగ్ కేంద్రాల వరకు ఉంటాయని, వాటిని పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కే.నర్సిరెడ్డి, హరినాథ రెడ్డి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.


Next Story