పోలీస్ స్టేషన్‌లో పోలీసుల దసరా మాముళ్లు.. జోరుగా అక్రమ మామూళ్ల పంపకం..?

by Disha Web |
పోలీస్ స్టేషన్‌లో పోలీసుల దసరా మాముళ్లు.. జోరుగా అక్రమ మామూళ్ల పంపకం..?
X

దిశ, నిఘా బ్యూరో: సూర్యాపేట జిల్లాలో దసరా మామూళ్లలో ఖాకీల హవా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దఫేదార్ వ్యవస్థనే పూర్తిగా తొలగించినప్పటికీ ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఇద్దరు వ్యక్తులు డఫేదారు గా కొనసాగుతున్నారు. ఆ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ తనకు జిల్లా బాస్ అత్యంత సన్నిహితుడని, తాను ఏమి చెబితే అది వింటాడని ప్రచారం చేసుకుంటూ దసరా పండుగ వేళ మామూళ్లకు తెగబడ్డాడు. వసూలు చేసిన మామూలు సమానంగా పంపిణీ చేయకుండా తేడాలు పెట్టడంతో విషయం వివాదాస్పదమైంది. వాస్తవంగా మంగళవారం రాత్రి స్టేషన్ లో పంపకాలు చేయాల్సి ఉండగా కొందరికి మామూళ్లు తక్కువ పంపిణీ చేయడంపై మరికొందరు పంపకాన్ని విభేధించి స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో సదరు స్టేషన్ ఎస్ హెచ్ ఓ బుధవారం అందరితో బేరసారాలు జరిపి హోదా ప్రకారం పంపకాలు చేసారు. తమ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకుండా ప్రత్యేక విభాగం సిబ్బందికి కూడా అక్రమాలలో భాగం పంపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్ ఐఅక్రమాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలలో తల దూర్చి పలు కేసుల్లో నీరుగార్చి కూనీ కొరులకు, అక్రమ వ్యాపారాలకు అండగా నిలుస్తున్న ఆ ఎస్సై తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో తన స్టేషన్లో ఇద్దరు పోలీసు సిబ్బంది ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరోకరు కానిస్టేబుల్ ను దఫేదార్ లు గా నియమించి వారం రోజులుగా మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులను వ్యాపారులను, అక్రమ వ్యాపార దారులను తాను ఇక్కడికి వచ్చి నాకా సంవత్సరన్నరకాలంగా ఎవరెవరు సహకరించారో అందరివద్ద మామూలు రూపేణా సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ అక్రమ వసూళ్లు చేసిన పైసలను మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో పంపిణీ చేయాల్సి ఉండగా పంపకాల్లో తేడా రావడంతో వివాదం బయటికి వచ్చింది.

పంపకాల లెక్క ఇదీ..

ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఒక్కో ఏ ఎస్ ఐ కి 6,000 చొప్పున , జమీందారులకు 4000 ల చొప్పున, పోలీస్ కానిస్టేబుళ్లకు 2000 ల చొప్పున, హోంగార్డులకు 2000ల చొప్పున ఎస్ఐ భాగాలు నిర్ణయించి పంపిణీ చేపట్టారు. దీనిలో కొందరు కానిస్టేబుళ్లు తాము కష్టపడి విధులు నిర్వర్తిస్తుండగా మరికొందరు ఇటువంటి కష్టం చేయకుండానే తమతో పాటు సమానంగా అక్రమాలను భాగాలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా బాస్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న ఎస్ ఐ తనను ప్రశ్నించిన వారిపై తన ప్రతాపం చూపారు. దీంతో వారి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఆ స్టేషన్ లో పనిచేస్తున్న కొందరు ఏఎస్ఐలు రాయబారం నడిపి బుధవారం ఉదయం అందరికీ సమభాగాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. తమ అక్రమ వసూళ్లకు ఇతర ఉన్నతాధికారులకు చేరవేయకుండా ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి కూడా స్టేషన్ నుంచి మామూళ్లు పంపి తమ అక్రమ వసూళ్లలో అన్ని విభాగాల వారికి భాగస్తులను చేశారు.

మొదటి నుంచి అంతే

ఆ స్టేషన్లో ఎస్హెచ్ఓ గా పనిచేస్తున్న అధికారి మొదటినుంచి కూడా అదే బుద్ధుని ప్రదర్శిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పక్క జిల్లాలో అక్కడ పనిచేస్తున్నప్పుడు, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో మరొక పోలీస్టేషన్లు పనిచేసినప్పుడు కూడా సదరు ఎస్సైపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. గత సంవత్సరన్నరకాలంగా ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో కూడా లెక్కకు మించి ఆరోపణలొచ్చిన జిల్లా నుండి పై స్థాయిలో ఉన్నతాధికారుల సత్సంబంధాలు ఉండటంతో ఎన్ని అక్రమాలకు పాల్పడిన అతనిపై చర్యలు శూన్యమని పోలీసు సిబ్బంది పేర్కొంటున్నారు. దసరా మామూళ్ళ పేరున ప్రస్తుతం సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి డెబ్బై వేల వరకు పంపిణీ చేసి పైసలను జిల్లా అధికారికి పంపించానని చెప్పి తానే నొక్కేశాడని బాధితుడు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారితో సత్సంబంధాలుంటే అక్రమ వసూళ్లకు పాల్పడాల్సిందేనంటు... మండలంలో పలువురు ప్రజా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed