దిశ ఎఫెక్ట్… స్పందించిన ఆలయ అధికారులు

by Kalyani |
దిశ ఎఫెక్ట్… స్పందించిన ఆలయ అధికారులు
X

దిశ, కనగల్లు: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అవసరం లేకున్నా అర్చక ఉద్యోగాలు, నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపే ప్రయత్నంలో అధికారులు అనే శీర్షిక మంగళవారం దిశ పత్రికలో ప్రచురితమైంది. దీంతొ దిశ కథనానికి బుధవారం మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం అధికారులు స్పందిస్తూ… ఆలయంలో అసిస్టెంట్ కుక్, పరిచారక (అర్చక) ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు నోటిఫికేషన్ జారీ చేసి, కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారానే నియామకాలు జరుగుతాయని, కమిషనర్ ఆదేశాలు లేకుండా ఏలాంటి నియామకాలు జరగవని ఆలయ ఈవో జె.జయరామయ్య తెలిపారు.

Next Story

Most Viewed