దిశ ఎఫెక్ట్.. ప్రకృతి వనాన్ని సందర్శించిన డీఎఫ్ఓ

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్.. ప్రకృతి వనాన్ని సందర్శించిన డీఎఫ్ఓ
X

దిశ, నడిగూడెం: గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పంచాయతీ అధికారి నిర్వహణ లోపం, సిబ్బంది సంరక్షించక పోవడంతో… లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మండలంలోని కాగిత రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం ఉదహరిస్తూ ఈ నెల 4వ తేదీన "మైదానం కాదిది.. పల్లె ప్రకృతి వనమే" అనే కథనాన్ని దిశ ప్రచురించింది.

దిశ కథనానికి స్పందించిన జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్ శుక్రవారం గ్రామంలోని ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ సిబ్బంది పై ఉందని, నిత్యం మొక్కలకు నీటిని అందజేసి ఎండి పోకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలదేనని అన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మల్లారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అలుగుపల్లి స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed