యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Disha Web Desk 6 |
యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వాయివారి ఆలయానికి రాష్ట్ర నలుమూలల ఉన్న ప్రజలు వస్తుంటారు. తాము కోరుకున్న కోరికలు నేరవేరడంతో కుటుంబ సభ్యులతో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే వీకెండ్ కావడంతో నరసింహా స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా కార్తీకమాసం చివరి దశకు రావడం అలాగే సెలవు కావడంతో భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కిక్కిరిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతం ఆచరించినట్లు సమాచారం. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

Next Story

Most Viewed