రామాలయాన్ని కూల్చేస్తారని చెప్పడం దారుణం.. మోడీపై జీవన్ రెడ్డి సీరియస్

by Rajesh |
రామాలయాన్ని కూల్చేస్తారని చెప్పడం దారుణం.. మోడీపై జీవన్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోడీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రధాని మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని తెలిపారు. రాజీవ్ గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. మత సామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అయితే యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామాలయాన్ని బుల్‌డోజర్‌లతో కూల్చేస్తారని ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Next Story