ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

by Disha Web Desk 11 |
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం
X

దిశ,నల్గొండ: నల్గొండ లో రోజు రోజుకు పెరిగిపోతున్న లంచగొండి అధికారులు. మొన్న నల్గొండ ఆసుపత్రికి చెందిన సూపరింటెండెంట్ నేడు డ్రగ్ ఇన్స్పెక్టర్. ఫార్మసీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ట్రస్టు నుంచి లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్ హ్యాండెడ్ గి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఏసీబీ అధికారులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్టును స్థాపించి పేదలకు ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

అయితే ట్రస్ట్ ఆసుపత్రికి అనుమతి పొందిన అనంతరం ఆసుపత్రి లో మెడికల్ షాప్ అనుమతి కోసం ట్రస్ట్ నిర్వాహాకులు ఆన్లైన్ లో అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ డాక్యూమెంట్లు సరిగా లేదని ఉన్నతాధికారులు కూడా చెక్ చేస్తారని ట్రస్ట్ నిర్వాహకుడి వద్ద మేనేజర్ గా పని చేస్తున్న చిట్టెపు సైదిరెడ్డిని తన కార్యాలయానికి పిలిపించి రూ. 18,000 లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ట్రస్ట్ నిర్వాహాకులు వెంకట్ రెడ్డికి సైదిరెడ్డి తెలియజేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించమని సలహా ఇవ్వడంతో చిట్టెపు సైదిరెడ్డి ఏసీబీ డీఎస్పీ, సీఐలను కలిసి విషయాన్ని వివరించారు.

వెంటనే ఏసీబీ అధికారుల సలహాతో నల్గొండ లోని తన కార్యాలయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ కు రూ. 18వేలను చిట్టెపు సైదిరెడ్డి ఇస్తుండగా డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ను ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ చంద్ర మాట్లాడుతూ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఫార్మసీ లైసెన్స్ కోసం చిట్టెపు సైదిరెడ్డి వద్ద రూ. 18వేలు లంచం తీసుకుంటుండగా తన కార్యాలయంలోనే ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ నరేందర్, సీఐలు వెంకట్రావు, రామారావు సంయుక్త ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమ శేఖర్ ను కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కి తరలిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ కు సమాచారం అందించి అవినీతి రహిత సమాజం కోసం పని చేయాలన్నారు.

Next Story

Most Viewed