అలుపెరుగని పోరాటయోధుడు బట్టి విక్రమార్క.. బండ్ల గణేష్

by Sumithra |
అలుపెరుగని పోరాటయోధుడు బట్టి విక్రమార్క.. బండ్ల గణేష్
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి : అలుపెరుగని పోరాటయోధుడు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అని సినీ నిర్మాత, స్టార్ కమెడియన్ బండ్ల గణేష్ అన్నారు. ఆదివారం సూర్యాపేటకు చేరుకున్న బట్టి విక్రమర్క పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వానాకాలం కాదు, చలికాలం కాదు, మండుటెండలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు నా మద్దతు, సంఘీభావం ప్రకటించేందుకే ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని ప్రజలందరూ మద్దతీయాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు సేవచేయాలి, తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకు భట్టి విక్రమార్క శ్రమిస్తున్నారని ఆకాశానికి ఎత్తారు.

భట్టి విక్రమార్కకు మద్దతుగా నిలవాల్సిన బాద్యత మనందరిమీదా ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లే భారత దేశం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్ళమన్నారు. ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కొనియాడారు. కర్ణాటక నుండి కాంగ్రెస్ హుదూద్ తుఫాన్ మొదలైందని, తెలంగాణ నుండి గెలుచుకుంటూ, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. 150రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమ వ్యక్తం చేశారు.

Next Story