ఇరుముడితో శ్రీశైలం బయలుదేరిన స్వాములు

by Disha Web |
ఇరుముడితో శ్రీశైలం బయలుదేరిన స్వాములు
X

దిశ, తుంగతుర్తి: ఆదివారం ప్రాతః కాల సమయం నుండే తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలలో ఉన్న దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కొత్తగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొద్దిరోజులుగా శివనామ స్మరణలతో మాలలు ధరించి భక్తి పరవశంతో నిష్టగా పూజలతో కొనసాగిన శివ స్వాములు ఇరుముడి కట్టుకొని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరారు. ఈ మేరకు శివ స్వాములతో బయలుదేరే ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసును స్వామి దొనకొండ రమేష్ జండా ఊపి ప్రారంభించారు.
Next Story

Most Viewed