సివిల్స్ సర్వీసెస్‌లో మెరిసిన అల్వాల యువకుడు

by Disha Web Desk 11 |
సివిల్స్ సర్వీసెస్‌లో మెరిసిన అల్వాల యువకుడు
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : యూపీఎస్సీప్రకటించిన సివిల్స్‌ ఫలితాలలో నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ సత్యనారాయణ రెడ్డి హేమలత కుమారుడు పెంకీస్ ధీరజ్ రెడ్డి సత్తా చాటాడు. మంగళవారం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆయన ఆల్ ఇండియా 173 వ ర్యాంకు సాధించారు.

ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే : పెంకీస్ ధీరజ్ రెడ్డి

ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే సివిల్‌ సర్వీసెస్‌ను ఎంపికచేసుకున్నా. మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు.చిన్నప్పటి నుంచి చుట్టూ జరుగుతున్న పరిణామాలు,సామాజిక పరిస్థితుల పై అవగాహన పెంచుకోవడంతోనే ఈ విజయం సాధ్యమైంది. సామాన్య ప్రజల జీవనాన్ని ప్రభావితం చేసే అంశాలకు ఎంతో సంబంధం ఉంటుంది. నా తల్లిదండ్రులతో సూచనలతో నా చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యంతో ముందుకు సాగాను. సివిల్స్‌ లక్ష్యంగా చేసుకుని కష్టపడి చదివాను. సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాలన్నది నాన్న కోరిక,నా కల కూడా. సివిల్స్‌తో మాత్రమే నిరుపేదలకు సేవ చేసే అవకాశముంటుందని బలంగా నమ్మాను. ప్రజలకు సేవ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను..

మా కల నెరవేరింది : పింకీస్ సత్యనారాయణ రెడ్డి

మా కుమారుడు పెంకీస్ ధీరజ్ రెడ్డి ను అత్యున్నత స్థానంలో చూడాలనే నా కల నెరవేరింది. చిన్నప్పటి నుంచి ధీరజ్ చదువులో చురుగ్గా ఉండేవాడు.కష్టపడి సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ సాధించడం గర్వంగా ఉంది.

ఫాదర్ సత్యనారాయణ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్,మదర్ రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు కావడం విశేషం


Next Story