జగదీశ్ రెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయి? : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
జగదీశ్ రెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయి? : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
X

దిశ,‌ యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కిరాయి ఇళ్లలో ఉండే జగదీశ్వర్ రెడ్డికి 100 ఎకరాల సంపాదన, కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని భువనగిరి అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014లో స్కూటర్ పైన తిరిగే జగదీశ్వర్ రెడ్డి నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‌కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు. కవిత తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతుందని ఎద్దేవా చేశారు.

మునుగోడు ఎన్నికల్లో అధికారం అడ్డుపెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేసి తన ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వార్ రూమ్ చైర్మన్ పవన్ మల్లాది, యూత్ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి సోనీ , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహాంగీర్, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ విభాగాల నుంచి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed