ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..

by Disha Web Desk 20 |
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : జిల్లాలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, ధాన్యం కొనుగోలు, ఎగుమతుల తీరుతెన్నులను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. శనివారం జాజిరెడ్డిగూడెం మండలంలోని కుంచమర్తి ఐకేపీ కేంద్రాన్ని, రామన్నగూడెంలో పీఏసీఎస్ కేంద్రాన్ని, జాజిరెడ్డిగూడెం మార్కెట్లోని గోపాలకృష్ణ రైతుమిత్ర కేంద్రాలను సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై డీఎం రాంపతితో కలిసి అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 272 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మండలంలో మోస్తరుగా కురిసిన వర్షానికి నష్టం వాటిల్లలేదన్నారు. వీరి వెంట పీఏసీఎస్ సీఈఓ రామస్వామి, సిబ్బంది మహేందర్, సైదులు, నిర్వాహకులు లొడంగి నాగరాజు, బింగి కృష్ణ, పాలకుర్తి నాగరాజు తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed