పేట మార్కెట్లో కందులకు రికార్డు స్థాయిలో ధర.. ఎంతో తెలుసా?

by Disha Web Desk 1 |
పేట మార్కెట్లో కందులకు రికార్డు స్థాయిలో ధర.. ఎంతో తెలుసా?
X

దిశ, సూర్యా పేట ప్రతినిధి: కంది రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కందుల రైతులుకు అత్యధిక ధరలు సోమవారం లభించాయి. మార్కెట్కు 49 మంది రైతులు 226 బస్తాల కందులను తీసుకురాగా, అందులో గరిష్టంగా రూ.8,172 పలుకగా, కనిష్టంగా రూ.6,345 ధర పలికింది. జనవరి 27 నుంచి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు కందులు రావడం ప్రారంభమైంది. రోజుకు 100 బస్తాల నుంచి 150 బస్తాల వరుకు వచ్చిన దాఖాలాలున్నాయి.

జనవరి 30 వరకు 65 మంది రైతులు, 282 బస్తాలను తీకురాగా, ఫిబ్రవరి 1 నుంచి 27 వరకు 850 మంది రైతులు 4,669 బస్తాల కందులను పేట మార్కెట్లో విక్రయించారు. మద్దతు ధర ఒక క్వింటాకు రూ.6,600 లు ఉండగా, మద్ధతు ధరకు మించి ధరలు ఎక్కువగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కందులకు ప్రైవేటు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో వ్యాపారస్థులు ఎక్కువ ధరలను కోడ్ చేసి కందులను కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కార్యదర్శి ఎండీ ఫసియోద్దన్ తెలిపారు.


Next Story

Most Viewed